'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' విడుదల తేదీ ఖరారు
- ఆది సాయికుమార్ నుంచి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
- ప్రతినాయకుడిగా అబ్బూరి రవి
- అక్టోబర్ 18న విడుదల
ఈ సినిమాలో తను ఎన్.ఎస్.జి. కమెండోగా కనిపిస్తాననీ, తన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆది సాయికుమార్ అన్నాడు. "శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అబ్బూరి రవి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు. నటుడిగా కూడా ఆయన బిజీ అయ్యేలా ఈ సినిమా చేస్తుంది. ఈ సినిమా టీమ్ అంతా కూడా నిర్మాణ భాగస్వాములు కావడం విశేషం. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు.