దసరాకి అనుష్క 'నిశ్శబ్దం' టీజర్
- 'భాగమతి'తో హిట్ కొట్టిన అనుష్క
- విభిన్నమైన కథాంశంతో 'నిశ్శబ్దం'
- వివిధ భాషల్లో విడుదలకి సన్నాహాలు
ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు. దసరా పండుగకి ఈ సినిమా నుంచి టీజర్ ను వదలాలని ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తన కెరియర్లోని చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందని అనుష్క భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.