పూరి మూవీలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ
- కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
- తదుపరి సినిమా బోయపాటితో
- పూరితో సినిమాకి కథ సిద్ధం
ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. పూరి సిద్ధం చేసిన కథను బాలకృష్ణ వినేయడం .. ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. ఆ పాత్రలకి మించి ఈ రోల్ ఉంటుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు 'పైసా వసూల్' వచ్చిన సంగతి తెలిసిందే.