'మీకు మాత్రమే చెప్తా' నుంచి లిరికల్ వీడియో సాంగ్
- విభిన్న కథా చిత్రంగా 'మీకు మాత్రమే చెప్తా'
- సంగీత దర్శకుడిగా శివకుమార్
- కీలక పాత్రలో అనసూయ
'ఏ ఎందుకు వై ఇలా .. నాకు మాత్రం ఎందుకిలా .. తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా?" అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వీడియో గేమ్ తరహా యానిమేషన్ విజువల్స్ తో ఈ సాంగ్ ను అందించారు. శివకుమార్ సంగీతం .. రాకేందుమౌళి సాహిత్యం .. హేమచంద్ర - కృష్ణన్ గణేశన్ ఆలాపనతో ఈ పాట సాగింది. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. నిర్మాతగా విజయ్ దేవరకొండ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.