తమిళనాట 'సైరా' భారీ రిలీజ్
- భారీ చారిత్రక చిత్రంగా 'సైరా'
- ఒకే రోజున 5 భాషల్లో విడుదల
- అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు
ఈ సినిమాను తమిళంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. 'సైరా'లో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించడం వలన, అక్కడ కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. అందువలన అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.