శుభశ్రీ మృతి ఎఫెక్ట్.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు కడితే ఏడాది జైలు
- ఉత్తర్వులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం
- అనుమతి లేకుండా బ్యానర్లు కడితే ఏడాది జైలు
- రూ.5 వేల జరిమానా
స్కూటీపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని శుభశ్రీపై బ్యానర్ పడడంతో ఆమె లారీ చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా స్థానిక పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడింది. హైకోర్టు ఆగ్రహంతో రంగంలోకి దిగిన పళనిస్వామి ప్రభుత్వం.. బ్యానర్ల సంస్కృతిని నిర్మూలించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.