గోపీచంద్ తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో తారాతోరణం... ప్రధాన ఆకర్షణగా ప్రభాస్, బన్నీ
- ఘనంగా గోపీచంద్ చిన్నకొడుకు పుట్టినరోజు
- హాజరైన టాలీవుడ్ నటులు, దర్శకులు
- వియాన్ కు ఆశీస్సులు అందజేసిన ప్రభాస్, బన్నీ
టాలీవుడ్ హీరోలు రామ్, విష్ణు మంచు, దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, తేజ, సంపత్ నంది తదితరులు వియాన్ కు ఆశీస్సులు అందజేశారు. హీరో గోపీచంద్ కు 2013లో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మాతో వివాహం జరిగింది. గోపీచంద్, రేష్మా దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పేరు విరాట్ కృష్ణ కాగా, రెండో కుమారుడు వియాన్.



