'దర్బార్' నుంచి రజనీ మరో పోస్టర్
- షూటింగు దశలో 'దర్బార్'
- అభిమానుల్లో భారీ అంచనాలు
- సంక్రాంతికి భారీ విడుదల
ఈ పోస్టర్లో రజనీ యాక్షన్ లుక్ ఆకట్టుకునేదిలా వుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. 'పేట' సక్సెస్ తరువాత రజనీ .. 'సర్కార్' సంచలన విజయం తరువాత విజయ్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.