సూర్య సరసన నయనతార, కాజల్
- విడుదలకి సిద్ధమైన సూర్య 'కాప్పాన్'
- శివ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
- సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
దర్శకుడు శివతో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అజిత్ కి వరుసగా భారీ విజయాలను ఇచ్చిన శివపై సూర్య అభిమానులు గట్టి నమ్మకంతో వున్నారు. సంఖ్యా పరంగా సూర్యకి ఇది 39వ సినిమా. ఈ యాక్షన్ సినిమాలో ఆయన సరసన నాయికలుగా నయనతారను .. కాజల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికల పాత్రల నిడివి సంగతి అటుంచితే, ఇద్దరి పాత్రలకి చాలా ప్రాధాన్యత వుంటుందని అంటున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.