కులం ఆధారంగా నీవు గొప్పవాడివి కాలేవు: లావణ్య త్రిపాఠి
- సమాజంలో బ్రాహ్మణులకు గొప్ప స్థానం ఉందన్న లోక్ సభ స్పీకర్
- సమాజానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని వ్యాఖ్య
- చేసే పనులను బట్టే గొప్పవాడివి అవుతావన్న లావణ్య
సినీ నటి లావణ్య త్రిపాఠి కూడా ఓం ప్రకాశ్ బిర్లా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. తాను కూడా బ్రాహ్మణ యువతినేనని చెప్పిన లావణ్య... కొందరు బ్రాహ్మణులకు మాత్రమే తాము గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పింది. నువ్వు చేసే పనులను బట్టే నువ్వు గొప్పవాడివి అవుతావని... కులం వల్ల కాదని తెలిపింది. ఆ తర్వాత తన ట్వీట్ ను డిలీట్ చేసింది.