ఏపీలో దసరా ఉత్సవాల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది!: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
- ఈ నెల 25లోపే ఉత్సవ ఏర్పాట్ల పూర్తి
- విజయవాడలో మీడియాతో ఏపీ దేవాదాయ మంత్రి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఈ నెల 25లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఫ్లైఓవర్ పనులు ఆటంకంగా మారొచ్చన్న అనుమానంతో నిర్మాణ సామగ్రిని రోడ్లపై నుంచి తొలగించాలని ఆదేశించామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.