యజ్ఞయాగాదులు చేసినవాళ్లంతా ఉత్తములు కారు, పురాణాల్లో రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలు
- ఆలయాల్లో రాజకీయపరమైన చిత్రాలు ఉండడాన్ని సహించబోమన్న లక్ష్మణ్
- వారం రోజుల్లో తొలగించాలని వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైనా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయంలో వ్యక్తుల చిత్రాలను ముద్రించడం అంటే దేవుడ్ని కించపర్చడమేనని, వారం రోజుల్లో ఆ చిత్రాలు తొలగించకపోతే హిందుత్వ సంస్థలు, బీజేపీ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు.