ఇలాంటి కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి ఉండరు: నాగబాబు
- అభిమానులకు వినాయకచవితి శుభాకాంక్షలు, పవన్ కు పుట్టినరోజు విషెస్ చెప్పిన మెగా బ్రదర్
- జనసేన క్యాడర్ ఎంతో బలంగా ఉందంటూ వ్యాఖ్యలు
- ఇలాంటి కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి ఉండరని వెల్లడి
జనసేన కార్యకర్తలు రూ.100 కోట్ల విరాళాలు సేకరించడం కంటే ఆ నిర్ణయమే చాలా గొప్పదని నాగబాబు అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ఎంతో బలంగా ఉందన్న విషయం కార్యకర్తల అభిమానం చూస్తే అర్థమవుతుందని తెలిపారు. డబ్బు, ఇతర ప్రలోభాలతో ఇలాంటి కార్యకర్తలు రారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యకర్తలు ఉండరని నాగబాబు కొనియాడారు.