ఆగిపోయిన 'కేజీఎఫ్ 2' షూటింగ్
- సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్'
- జోరుగా జరుగుతోన్న సీక్వెల్ షూటింగ్
- అనుకోకుండా ఏర్పడిన ఆటంకం
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కోలార్ ఫీల్డ్స్ లోని 'సైనైడ్ హిల్స్'లో కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగు వలన అక్కడి పర్యావరణం దెబ్బతింటోందంటూ కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టులో 'పిల్' వేశాడు. దీనిపై ఈ రోజున విచారణ జరిపిన న్యాయస్థానం, అక్కడ జరుపుతోన్న షూటింగును వెంటనే నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దాంతో ఈ సినిమా షూటింగుకి ఊహించని ఆటంకం ఏర్పడింది. అదే తరహా లొకేషన్ ఎక్కడుందో గాలించాలనీ, దొరకని పక్షంలో సెట్ వేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.