'ఎంత మంచివాడవురా'లో హాట్ భామగా నటాషా దోషి
- సతీశ్ వేగేశ్న నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
- కల్యాణ్ రామ్ కి ఇది 17వ సినిమా
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగు వుందట. తాజాగా ఆ ఐటమ్ సాంగును చిత్రీకరించారని చెబుతున్నారు. నటాషా దోషి - కల్యాణ్ రామ్ పై చిత్రీకరించిన ఈ ఐటమ్ సాంగ్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ 'జై సింహా'లో నాయికగా నటాషా దోషి, మెరిసిన సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ కి ఇది 17వ సినిమా. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.