సంక్రాంతి బరిలోకి 'ఎంత మంచివాడవురా'
- కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్న
- గ్రామీణ నేపథ్యంలో సాగే 'ఎంత మంచివాడవురా'
- కథానాయికగా మెహ్రీన్
తాజాగా 'ఎంత మంచివాడవురా' సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఇది తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.