పాప పెళ్లి ఇంకా కుదరలేదు... మరో నెల రోజుల పెరోల్ కావాలంటున్న నళిని!
- ఇంకా ఇండియాకు రాని హరిద్ర
- సెప్టెంబర్ వరకూ పరీక్షలు ఉన్నాయన్న నళిని తల్లి
- నలుగురిని చూశామని అంటున్న పద్మ
ఈ విషయాన్ని వెల్లడించిన నళిని తల్లి పద్మ, మనుమరాలికి వివాహం జరిపించేందుకు నలుగురిని చూశామని, ఆమె విదేశాల నుంచి రాగానే, వారిని చూపించి, ఒకరిని నిశ్చయం చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ వరకూ ఆమెకు పరీక్షలు ఉన్నందున భారత్ రాక ఆలస్యం అవుతోందని, అందువల్ల పెరోల్ పొడిగింపును కోరుతున్నామని, కోర్టు తమ విజ్ఞప్తిని మన్నిస్తుందనే భావిస్తున్నామని అన్నారు.