'బిగిల్' యూనిట్ కి బంగారు ఉంగరాలు పంచిన విజయ్
- అట్లీ కుమార్ దర్శకత్వంలో 'బిగిల్'
- విజయ్ సరసన నయనతార
- దీపావళికి భారీస్థాయి విడుదల
అందువల్లనే సినిమా పూర్తయిన ప్రతిసారి ఆ సినిమా కోసం కష్టపడిన వాళ్లందరికి ఆయన కానుకలు అందజేస్తుంటాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందుతోన్న 'బిగిల్' చిత్రం రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, యూనిట్ సభ్యులందరికీ సినిమా టైటిల్ రాయబడిన బంగారు ఉంగరాలను విజయ్ అందజేశాడు. దాంతో యూనిట్ సభ్యులంతా ఆనందంతో పొంగిపోతున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను 'దీపావళి'కి విడుదల చేయనున్నారు.