బాహుబలితో 'సాహో'ను పోల్చవద్దు... దేనికదే డిఫరెంట్: దర్శకుడు సుజిత్
- ఆగస్టు 30న సాహో రిలీజ్
- సాహో ఎవరినీ నిరాశ పర్చదంటున్న దర్శకుడు
- రాజమౌళితో పోల్చుకుంటే తాను చాలా చిన్నవాడ్నని వ్యాఖ్యలు
అంతేకాకుండా, మీడియాలో రాజమౌళి వంటి దర్శక దిగ్గజంతో పోలుస్తూ తనపై కథనాలు వస్తున్నాయని, వాస్తవానికి రాజమౌళి సర్ తో పోల్చుకుంటే తాను చాలా చిన్నవాడ్నని సుజిత్ వినమ్రంగా చెప్పాడు. తనకు తానుగా అలాంటి టాప్ డైరెక్టర్లతో ఎప్పుడూ పోల్చుకోనని, ఒకవేళ పోలిక తీసుకువచ్చినా అంతగొప్ప దర్శకుడితో నీకు పోలికా? అంటూ మా అమ్మ కూడా ఒప్పుకోదు అంటూ ఈ యువ దర్శకుడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
'సాహో' వంటి భారీ బడ్జెట్, హైవోల్టేజ్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ముందు సుజిత్ చేసింది ఒక్క సినిమానే అంటే అతిశయోక్తి కాదు. శర్వానంద్ హీరోగా వచ్చిన 'రన్ రాజా రన్' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ప్రభాస్ 'సాహో' చిత్రం చేసేందుకు సుజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.