మళ్లీ శర్వానంద్ ను ఎలా చూడాలనుకున్నామో అలా ఉంది: రామ్ చరణ్
- రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
- శర్వాలో ఉండే తీవ్రత ఎంతో ఇష్టమంటూ వ్యాఖ్యలు
- ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వా కొత్త చిత్రం రణరంగం
ఈ ట్రైలర్ బీభత్సంగా ఉందని, శర్వానంద్ ను ఎలా చూడాలని భావించామో అలాగే ఉందని తెలిపారు. శర్వాలో తనకు నచ్చే అంశం సినిమా పట్ల అతడికి ఉండే తీవ్రత అని చెర్రీ వెల్లడించారు. శర్వా కెరీర్ లో కో అంటే కోటి తర్వాత అదే స్థాయి ఉన్న చిత్రం రణరంగం అవుతుందని అన్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.