అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్నాను: యాంకర్ అనసూయ
- అనసూయ పాత్ర చుట్టూ తిరిగే 'కథనం'
- రేపే థియేటర్లకు రానున్న సినిమా
- ప్రమోషన్లలో బిజీగా వున్న అనసూయ
బిగ్ బాస్ నుంచి నాకు కూడా ఆఫర్ వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేను. ఫ్యామిలీని వదిలి అన్నేసి రోజులు దూరంగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యాన్ని నేను చేయలేను. షూటింగుకి బయటికి వెళితేనే రెండు మూడు సార్లు వీడియో కాల్ చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ అవకాశం ఉండదు. అందుకే వాళ్లు అడిగినా వెళ్లలేదు" అని చెప్పుకొచ్చింది.