రవితేజ తరువాత ఆ స్థాయిలో దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ: నటుడు ఉత్తేజ్
- మహేశ్ బాబు మంచి అందగాడు
- ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఎన్టీఆర్
- తనని తాను చెక్కుకున్న శిల్పం అల్లు అర్జున్
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇక తనకి తాను చెక్కుకున్న ఒక శిల్పంగా అల్లు అర్జున్ అనిపిస్తాడు. తండ్రినే గురువుగా భావించి ఎంతో నేర్చుకుని, రెండు మూడు సినిమాలతోనే లక్ష్యాన్ని చేరుకున్న హీరో చరణ్ అని చెప్పొచ్చు. ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ. రవితేజ తరహాలో తనకంటూ ఒక కొత్త స్టైల్ ను క్రియేట్ చేసుకుని, చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా తెరపైకి దూసుకొచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.