ఖుష్బూ అభిమాని నన్ను రాయితో కొట్టింది: నటుడు రాజా రవీంద్ర
- తమిళంలో 'పురుష లక్షణం' సినిమా చేశాను
- నాది ఖుష్బూ ను టార్చర్ చేసే విలన్ పాత్ర
- అక్కడి జనానికి తనపై కోపం వచ్చేసిందన్న రాజారవీంద్ర
ఈ సినిమాలో నేను ఖుష్బూని ఎంతగానో వేధిస్తాను. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. నా పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. ఆ తరువాత కొన్ని రోజులకి నేను చేస్తోన్న మరో సినిమా షూటింగ్ అక్కడి బీచ్ లో జరుగుతోంది. 'పురుష లక్షణం' సినిమాలో నేను ఖుష్బూను ఏడిపించాననే కోపంతో ఒకావిడ నన్ను రాయి పెట్టి కొట్టింది. దెబ్బ తగిలినా నేను బాధ పడలేదు .. ఆ పాత్ర అంత బాగా చేశాననుకుని సంతోషపడ్డాను" అని చెప్పుకొచ్చాడు.