అమల, సమంతలను బిగ్ బాస్ కు పంపించి డబ్బులు సంపాదించుకోండి: నాగార్జునపై శ్వేతారెడ్డి ఫైర్
- నాగార్జునకు సామాజిక బాధ్యత లేదు
- బిగ్ బాస్ పై ఆరోపణలకు ఎందుకు స్పందించడం లేదు?
- నాగార్జున దొంగలా దాక్కుంటున్నారు
దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. వారిద్దరినీ బిగ్ బాస్ షోకు పంపి డబ్బులు సంపాదించుకోవాలని అన్నారు. నాగార్జున దొంగలా దాక్కుంటున్నారని... తప్పు చేయకపోతే బయటకు వచ్చి స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు కదా అంటూ విమర్శలు గుప్పించారు.