త్వరలో జాతీయ పార్టీలోకి శివాజీ.. ప్రత్యర్థులకు త్రీడీ సినిమా చూపిస్తానని హెచ్చరిక
- రెడ్లకు, రావులకు భయపడే రకం కాదు నేను
- రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం వల్లే టార్గెట్ అయ్యా
- బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
కేసీఆర్, జగన్ కలవడంలో తప్పులేదని అయితే, ఇద్దరూ కలిసి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. గతంలో ఏపీ ప్రజలను రాక్షసులు అన్న కేసీఆర్ ఇప్పుడు ఏపీకి గోదావరి జలాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం వల్లే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను కనుక బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తాను రెడ్లకు, రావులకు భయపడే రకం కాదని, తానెక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. మీడియా ఇంకా ఎంతోకొంత బతికే ఉంది కాబట్టే తన వాదనను వినిపించగలుగుతున్నానని శివాజీ అన్నారు.