కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి: సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు
- నా మీద ఉంది ఓ చెత్త కేసు
- మీ ఓనర్ పై 36 కేసులు .. జైల్లో ఉండి వచ్చాడు
- సాక్షి ఛానెల్ ను, కొమ్మినేని శ్రీనివాస్ ను సెట్ చేయాలి
ముందు, సాక్షి ఛానెల్ ను, కొమ్మినేని శ్రీనివాస్ ను సెట్ చేయాలి. ఆ కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి. వేరే ఇంకెవరూ లేరు. ఐయామ్ సారీ టూ సే దిస్. నా మీద వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు పేలాడు. వ్యక్తిగతమెందుకు? ఎవరి గురించి అయినా మనం నెగెటివ్ గా మాట్లాడుతుంటే, లోపల అవయవాలన్నీ కుళ్లిపోతుంటాయి. అట్లాగే, ఇంకో అతను, జర్నలిస్టు బిళ్ల ఒకటి వేసుకుని కూర్చుని.. కమ్మోళ్లు ఏం పని చేయాలి? రెడ్లు ఏం పని చేయాలి? కమ్మోళ్లకు రాజకీయాలు అవసరం లేదని ఓ సన్నాసి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి బఫూన్లను టార్గెట్ చేయడం నా పని కాదు’ అంటూ విరుచుకుపడ్డారు.