పార్లమెంటులో పసిబిడ్డను లాలించిన ప్రధాని మోదీ... ఫొటోలు వైరల్
- మనవడితో పార్లమెంటుకు వచ్చిన బీజేపీ ఎంపీ
- చిన్నారి కేరింతలకు మురిసిపోయిన మోదీ
- సోషల్ మీడియాలో ఫొటోలకు విపరీతమైన స్పందన
తన చేతుల్లోకి వచ్చిన ఆ పసిబిడ్డను మోదీ కాసేపు ఆడించడమే కాదు, ఆ చిన్నారి తన చేతుల్లో కేరింతలు కొడుతుంటే మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ప్రధాని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫొటోలు పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే భారీ స్పందన కనిపించింది. కొద్ది వ్యవధిలోనే నెటిజన్లు లైకులు, షేర్లతో హోరెత్తించారు.
