‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ నాదే.. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాం!: హీరో ఆకాశ్
- వ్యక్తి మెదడు మార్పిడి కాన్సెప్ట్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’
- రాధ అనే దర్శకురాలు సినిమా తెరకెక్కించారన్న ఆకాశ్
- ‘నాన్ యార్’ పేరుతో తమిళ్లో విడుదల
ఈ సినిమా తమిళ్లో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైందని, తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆకాశ్ పేర్కొన్నాడు. అదే సమయంలో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ తమను షాక్‌కు గురి చేసిందని, ఈ విషయమై పూరిని సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నాడు. తక్షణమే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసి, మీడియాను ఆశ్రయించామన్నాడు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాకుంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆకాశ్ తెలిపాడు.