తాజ్ మహల్ శివాలయమే.. ప్రతీ సోమవారం పూజలు నిర్వహిస్తాం!: శివసేన
- శివసేన ప్రకటనపై ఏఎన్ఐ ఆందోళన
- భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి లేఖ
- తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదన్న శివసేన
తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదనీ, అది శివాలయమని పలు హిందుత్వ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అడుగు ముందుకేసిన శివసేన పార్టీ (ఆగ్రా విభాగం) ప్రతీ సోమవారం తాజ్ మహల్ లో హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏఎన్ఐ తాజ్ మహల్ కు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.