'ద వెడ్డింగ్ గెస్ట్' శృంగార సీన్ లీక్... సైకోలు ఎక్కువయ్యారని రాధికా ఆప్టే మండిపాటు!
- దేవ్ పటేల్ తో కలిసి నటించిన రాధికా ఆప్టే
- సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ వైరల్
- సైకో మెంటాలిటీ పెరిగిపోయిందన్న రాధిక
ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ చేశారని, ఇది ఎవరో కావాలని చేసిందేనని వ్యాఖ్యానించింది. బోల్డ్ సీన్లలో నటించేందుకు తానేమీ భయపడబోనని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని, నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించిన ఆమె, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తానని తెలిపింది.