తన పారితోషికం వార్తలపై స్పందించిన రష్మిక
- వరుస సక్సెస్ లతో రష్మిక
- స్టార్ హీరోల సరసన దక్కుతోన్న చోటు
- తన కష్టానికి తగినట్టుగానే తన పారితోషికం ఉందన్న రష్మిక
ఈ నేపథ్యంలో రష్మిక తన పారితోషికం బాగా పెంచేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ .. "నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల సక్సెస్ రేటును బట్టి .. క్రేజ్ ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను .. ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది.