నారాయణఖేడ్ లో మంచు మనోజ్ కు ఓటు.. విచారణకు ఆదేశించిన కలెక్టర్
- మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో మంచు మనోజ్ పేరు
- ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- అధికారుల తీరుపై అసంతృప్తి
ఈ ఓటరు జాబితాలో మంచు మనోజ్ కు సంబంధించిన అన్ని వివరాలు పేర్కొన్నారు. మంచు మనోజ్ ఫొటోతో పాటు, తండ్రి పేరు మంచు మోహన్ బాబు అని, రెండో వార్డులో 2-25 ఇంటి నెంబర్ అని పేర్కొన్నారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను సరిగా పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.