ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి
- ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు
- అక్కడికక్కడే మృతి చెందిన లక్ష్మణ్
- పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ఇంతలోనే ఓ ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చింది. అక్కడే కూర్చొని ఉన్న లక్ష్మణ్‌కు కనీసం తప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ నిర్వహిస్తున్నారు.