వాళ్లకి పనీపాటా లేదు.. పనికొచ్చే వాటిపై శ్రద్ధ పెట్టండి: రష్మి ఫైర్
- సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారు
- సెలబ్రిటీలు చేసే మంచి పనులను కూడా చూడండి
- ఒక మంచి పనిని కూడా అభిమానులు పాటించట్లేదు
అయితే ఈ ఛాలెంజ్‌పై ప్రముఖ యాంకర్ రష్మి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్న వాళ్లకి పనీపాటా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై పెట్టే శ్రద్ధను పనికొచ్చే వాటిపై పెట్టాలని సూచించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలనుకుంటున్న వారు సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారని.. అలాంటి వారు సెలబ్రిటీలు చేసే మంచి పనులను కూడా చూడాలని తెలిపింది. సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్క దాన్ని కూడా వారి అభిమానులు పాటించట్లేదని పేర్కొంది.