అన్నయ్య నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించనున్న పవన్ కల్యాణ్
- సమన్వయ కమిటీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం
- క్షేత్ర స్థాయి నాయకులను కలవలేకపోతున్న పవన్
- ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాగబాబు
క్షేత్ర స్థాయి నాయకులను తాను కలవడానికి వీలు పడకపోవడంతో.... ఆ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచన. ప్రజారాజ్యం పార్టీలో కూడా నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కేడర్ కు దగ్గరగా ఉంటూ, కింది స్థాయి నేతలతో తరచూ సమావేశాలను నిర్వహిస్తుండేవారు. ఈ నేపథ్యంలో, నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి పవన్ వచ్చారు.