టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం!
- చింతమనేని కుటుంబం అక్రమంగా లబ్ధిపొందిందన్న అబ్బయ్యచౌదరి
- వైసీపీ నేత ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఇన్ చార్జ్ మంత్రి
- విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
పశుసంవర్థక శాఖ ప్రజలకు అందించాల్సిన ఫలాలను చింతమనేని కుటుంబం అక్రమంగా పొందిందని ఆయన విమర్శించారు. పశుసంవర్థక శాఖ లబ్ధిదారుల జాబితాలో చింతమనేని ప్రభాకర్ భార్య, తండ్రి కేశవరావుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.