రెండేళ్లలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. ఇది 100 శాతం గ్యారెంటీ!: బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్
- గజదొంగగా మారి చంద్రబాబు దోచుకున్నారు
- ఏపీలో టీడీపీ దొంగల పార్టీగా మారిపోయింది
- కర్నూలులో బీజేపీ కార్యకర్తలతో సునీల్ భేటీ
ఏపీలోని కర్నూలు జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో జరిగిన భేటీలో సునీల్ దేవ్ ధర్ ఈ మేరకు మాట్లాడారు. ఏపీలో టీడీపీ దొంగల పార్టీగా, తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గ్రామగ్రామాన అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు.