మానస సరోవర్ లో హైదరాబాదీల నరకయాతన!
- 40 మంది యాత్రికులు మానస్ సరోవర్ కు పయనం
- సదరన్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం
- అనూహ్యంగా చిక్కుకుపోయిన వైనం
హైదరాబాద్ కు చెందిన 40 మంది వ్యక్తులు ఈ నెల 13న మానస సరోవర్ కు వెళ్లారు. వారంతా సదరన్ ట్రావెల్స్ సంస్థ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అయితే, అక్కడికి వెళ్లిన హైదరాబాదీలు అనూహ్యరీతిలో చిక్కుకుపోయారు. అక్కడి వాతావరణం సరిపడక వారిలో కొందరు అస్వస్థత పాలయ్యారు. తమను కాపాడాలంటూ కొన్ని వీడియోల ద్వారా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపారు. వారిలో కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ట్రావెల్స్ యాజమాన్యం తమ గురించి పట్టించుకోవడం లేదని సదరు యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.