శేఖర్ కమ్ముల ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడట
- 'ఫిదా'తో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల
- తాజా సినిమా అవుట్ పుట్ పట్ల అసంతృప్తి
- చైతూతో కొత్త ప్రాజెక్టు మొదలు
50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత, హఠాత్తుగా ఆయన చైతూ - సాయిపల్లవిలతో తన కొత్త సినిమాను ప్రకటించాడు. దాంతో ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా పూర్తయిన తరువాత, చైతూ సినిమాను మొదలెడతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్తవాళ్లతో మొదలుపెట్టిన సినిమాను శేఖర్ కమ్ముల ఆపేశాడనేది తాజా సమాచారం. ఆ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తి చెందని శేఖర్ కమ్ముల, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల ఇంతటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే.