అవన్నీ పుకార్లేనండీ బాబూ: హీరోయిన్ రెజీనా
- నాకు నిశ్చితార్థం జరగలేదు
- పెళ్లి తేదీ ఖరారు కాలేదు
- ఈ పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి
ఈ వార్త అంతకంతకూ బలాన్ని పుంజుకుంటూ ఉండటంతో, రెజీనా రంగంలోకి దిగిపోయింది. "వారం రోజులుగా నా పెళ్లి గురించిన వార్తలు షికారు చేస్తున్నాయి. ఇవి అంతకంతకూ ఎక్కువవుతుండటం నాకు ఆందోళన కలిగించింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నాకు నిశ్చితార్థం జరగలేదు .. పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో .. ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నిజంగానే నాకు పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేస్తాను .. అప్పటివరకూ ఇలాంటి పుకార్లు నమ్మొద్దు" అని చెప్పుకొచ్చింది.