శర్వానంద్ భుజం ఎముక విరిగి ఐదారు ముక్కలైంది: డాక్టర్ గురవారెడ్డి
- భుజం గాయం అత్యంత తీవ్రమైనది
- శర్వానంద్ కాలికి తగిలిన గాయం చిన్నదే
- మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం
"శర్వానంద్ కు తగిలిన గాయాలు ఎముకలకు సంబంధించినవి కావడంతో ఆపరేషన్ కు గంటల కొద్దీ సమయం పట్టింది. కాలికి తగిలిన గాయం చిన్నదే కానీ, భుజం ఎముకకు తగిలిన గాయం అత్యంత తీవ్రమైనది. ఆ ఎముక విరిగి ఐదారు ముక్కలైంది. గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి మాకు ఐదు గంటల సమయం పట్టింది. మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం, త్వరగానే కోలుకుంటాడు" అని పేర్కొన్నారు.