'కర్తవ్యం' సినిమా విషయంలో అలా జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ
- విజయశాంతిని తొలిసారిగా అక్కడ చూశాను
- ఎ.ఎం. రత్నం కోరడంతో కథ రాశాము
- క్లైమాక్స్ ను మార్చడం జరిగింది
ఆ రోజున చాలా చిన్నపిల్లగా కనిపించిన విజయశాంతి, ఆ తరువాత సంచలనాలు సృష్టించింది. మేము శారద గారితో 'ప్రతిధ్వని' చేసిన తరువాత, అలాంటి కథ ఒకటి విజయశాంతికి రాయమని నిర్మాత ఎ.ఎం.రత్నంగారు అడగడం మొదలుపెట్టారు. ఆ తరువాత నేను 'కర్తవ్యం' సినిమా కథ రాశాను. కథ పూర్తయిన తరువాత 'మీనా' పాత్రను జోడించడం జరిగింది. ఆ తరువాత విజయశాంతి పాత్రను హైలైట్ చేయడం కోసం క్లైమాక్స్ ను మార్చడం జరిగింది. ఈ సినిమా ఎంతటి సంచలనానికి తెరతీసిందో తెలిసిందే" అన్నారాయన.