విశాల్... నీపై చాలా ఆరోపణలున్నాయి, శరత్ కుమార్ ను తప్పుబట్టేందుకు నువ్వు అర్హుడివి కావు: రాధిక
- ఆరోపణలు నిరూపించగలవా అంటూ సవాల్ విసిరిన రాధిక
- విశాల్ పైనే ఎన్నో విమర్శలున్నాయంటూ ఎదురుదాడి
- కుట్రపూరితమైన వ్యవహారాలు సంఘానికి మంచిది కాదంటూ హితవు
"విశాల్ ను చాలామంది విమర్శిస్తున్నారు. అలాంటి విశాల్ ఇప్పుడు శరత్ కుమార్ పై ఆరోపణలు చేయడమా? విశాల్ కొంతకాలంగా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పాండవర్ ప్యానెల్ 2015లో కూడా ఇదే బాణీ ఆలపించింది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఏ మార్పు లేదు. నాజర్ అంతటివాడే నడిగర్ సంఘంలో అన్నీ తనకు తెలియకుండానే జరిగిపోతుంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కుట్రపూరితమైన వ్యవహారాలు నటులకు, సంఘానికి ఏమంత క్షేమకరం కాదు. తరచుగా శరత్ కుమార్ ను విమర్శిస్తున్న విశాల్ దమ్ముంటే తన ఆరోపణలను నిరూపించగలరా?" అంటూ రాధిక సవాల్ విసిరారు.