మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన టబూ
- హిందీలో హిట్ కొట్టిన 'దే దే ప్యార్ దే'
- త్వరలో తెలుగులోకి రీమేక్
- సెట్స్ పైకి తీసుకెళ్లేదిశగా సన్నాహాలు
పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది తాజా సమాచారం. 28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుందన్న మాట. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారో .. మరొకరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.