చిరూ, కొరటాల మూవీలో అనసూయ?
- బుల్లితెరపై బిజీగా అనసూయ
- వెండితెర నుంచి కూడా వరుస అవకాశాలు
- కొరటాల సినిమాకి భారీ పారితోషికం
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరూ సరసన కథానాయికగా శ్రుతి హాసన్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందుకోసం అనసూయకి భారీ మొత్తంలోనే పారితోషికం ముడుతోందని చెప్పుకుంటున్నారు.