కావాలనే నా సినిమా గురించి చెడుగా చెప్పారు: హీరో విష్వక్సేన్
- నా సినిమాపై చెడుగా ప్రచారం చేశారు
- నా సినిమా పోస్టర్స్ చింపేశారు
- పథకం ప్రకారమే ఇవన్నీ చేశారు
"సాధారణంగా తొలి రోజున సినిమా చూసి థియేటర్స్ లో నుంచి వచ్చేవారు, మీడియా వారికి తమ అభిప్రాయం చెప్పేసి వెళ్లిపోతుంటారు. అయితే ఈ విషయంలో కొన్ని బ్యాచులు రంగంలోకి దిగి, నా సినిమా బాగోలేదని చెప్పాయి. పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ప్రకారం .. కావాలనే వాళ్లు అలా చేశారు. ఆ తరువాత నా సినిమా పోస్టర్స్ చింపేశారు. అందుకనే నాకు అంత కోపం వచ్చింది. నా సినిమా బాగుంది కాబట్టేగదా ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది" అంటూ చెప్పుకొచ్చారు.