సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నాగార్జున సినిమాలో కీర్తి సురేశ్
- గోపీచంద్ షూటింగుకి రెడీ
- సంపత్ నంది దర్శకత్వంలో కల్యాణ్ రామ్
* గోపీచంద్ హీరోగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. గతంలో ఈ చిత్రం షూటింగులో గోపీచంద్ గాయపడడం వల్ల ఇన్నాళ్లూ షూటింగ్ ఆగిపోయింది.
* ప్రస్తుతం 'తుగ్లక్' సినిమాలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.