బీజేపీ ‘జై శ్రీరాం’ నినాదంపై మమత మండిపాటు... సీత ఎక్కడంటూ నిలదీత!
- బెంగాల్లో బీజేపీ-మమత మధ్య ముదురుతున్న వివాదం
- జైసీతారాం నినాదాన్ని బీజేపీ వక్రీకరించిందని మమత మండిపాటు
- మమత ప్రవర్తన అనాగరికంగా ఉందన్న కేంద్రమంత్రి
కాగా, మమత తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, మాతంగిని హజ్రా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖాజీ నెహ్రుల్ ఇస్లాం ఫొటోలను చేర్చారు. ‘జై హింద్, జై బంగ్లా’ అనే నినాదాన్ని పెట్టారు. మమత తీరుపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తీవ్ర విమర్శలు చేశారు. ఆమె అనుభవజ్ఞురాలే అయినా ప్రవర్తన మాత్రం అనాగరికంగా ఉందన్నారు. బెంగాల్లో బీజేపీ ఉనికిని చూసి మమత భయపడిపోతున్నారని మంత్రి అన్నారు.