'సెవెన్' ఉత్కంఠను రేపే సినిమా: హీరో హవీశ్
- సస్పెన్స్ థ్రిల్లర్ గా 'సెవెన్'
- నాయికలుగా రెజీనా - నందిత శ్వేత
- ఈ నెల 5వ తేదీన విడుదల
ఈ సందర్భంగా హవీశ్ మాట్లాడుతూ .. "నిజం చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాల పట్ల నేను పెద్దగా ఆసక్తిని చూపను. కానీ ఈ కథ విన్న వెంటనే .. 'ఈ సినిమాను మనం చేస్తున్నాము' అని దర్శకుడికి చెప్పేశాను. అంతగా ఈ కథ నాకు నచ్చేసింది. అనూహ్యమైన సంఘటనలతో .. ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది. ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుందనే నమ్మకం వుంది. నా కెరియర్ కి ఈ సినిమాకి తప్పకుండా హెల్ప్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.