'హిరణ్యకశిప' పనులు ఒక కొలిక్కి వచ్చేసినట్టే!
- గుణశేఖర్ నుంచి మరో పౌరాణికం
- 'హిరణ్యకశిప'గా రానా
- త్వరలో పూర్తి వివరాలు
ఆ సమయంలో సురేశ్ బాబు ఈ సినిమా ఉందనీ .. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని ఓ వేదిక ద్వారా స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు గుణశేఖర్ రంగంలోకి దిగిపోయారు. 'హిరణ్యకశిప'గా రానా చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. మూడేళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని అన్నారు. గుణశేఖర్ మాటలను బట్టి, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వచ్చేసినట్టే కనిపిస్తోంది మరి.